breaking news
marekka
-
వదినపై చెప్పుతో దాడి
రాయదుర్గం రూరల్ : ఇద్దరూ కులాలు వేరైనా ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారికి తీపిగుర్తుగా ఒక కూతురు కూడా జన్మించింది. మండలంలోని చదం గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన బోయ మారెక్క, షమీ మూడేళ్లుగా ప్రేమించుకుని వివాహ చేసుకుని, బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. వారిద్దరికి ఒక కూతురు జన్మించింది. రిజిష్టర్ పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిశ్చయించుకుని ఇద్దరు స్వగ్రామానికి వచ్చారు. పట్టణంలో రిజిష్టర్ కార్యాలయానికి వెళుతుండగా షమీ సోదరుడు జోక్యం చేసుకుని మా అన్న బతుకును నాశనం చేశావని నన్ను చెప్పుతో కొట్టాడని మారెక్క బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
ఉరవకొండ: స్థానిక 10వ వార్డు ఎస్సీ కాలనీలోని వుూగ బసవన్న కట్ట వద్ద నివాసముంటున్న శతాధిక వృద్ధురాలు తొండ్లం మారెక్క (108) బుధవారం కన్నుమూసింది. వృద్ధురాలు నూరేళ్ల వయుస్సుపై బడినా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తానే చేసుకొనేదని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.