లేడీస్ హాస్టళ్లలో ఫోన్లు చోరీ చేసి... | man arrested over phones robbery in ladies hostels | Sakshi
Sakshi News home page

లేడీస్ హాస్టళ్లలో ఫోన్లు చోరీ చేసి...

Aug 18 2016 2:40 PM | Updated on Sep 4 2017 9:50 AM

లేడీస్ హాస్టళ్లలో సెల్‌ఫోన్లు కొట్టేస్తూ యువతులను వేధిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

హైదరాబాద్: లేడీస్ హాస్టళ్లలో సెల్‌ఫోన్లు కొట్టేస్తూ యువతులను వేధిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాలివీ.. సంతోష్‌కుమార్ అనే యువకుడు గత కొంత కాలంగా లేడీస్ హాస్టళ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంతేకాదు, చోరీ చేసిన సెల్‌ఫోన్లతో యువతులను బెదిరిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంతోష్‌కుమార్‌ను గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement