కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో పదేళ్ల బాలికపై ఒక యువకుడు లైంగికదాడికి పాల్పడిన విషయం మంగళవారం వెలుగు చూసింది.
బాలికపై లైంగికదాడి: యువకుడికి దేహశుద్ధి
Jul 26 2016 3:53 PM | Updated on Aug 1 2018 2:31 PM
సారంగాపూర్: కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో పదేళ్ల బాలికపై ఒక యువకుడు లైంగికదాడికి పాల్పడిన విషయం మంగళవారం వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లిన సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి పొరుగింట్లో ఉన్న రవి(22) అనే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం యువకుడు బెదిరించడంతో బాలిక విషయం ఎవరికీ చెప్పలేదు. నాలుగు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యురాలు బాలికపై లైంగికదాడి జరిగిందని తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో బాలిక తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్‌కు విషయం తెలియజేశారు. గ్రామస్తులు నిదితుడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. సారంగపూర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement