ఓటమి ఎదురైందని డీలా పడిపోకూడదు, ఓటమి విజయానికి నాంది అన్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి అన్నారు. సినీ నేపథ్య గాయకలు మల్లికార్జున్, గోపికా పూర్ణిమా దంపతులు. భోగాపురం సమీపంలోని దెంకాడ మండలం బంటుపల్లి గ్రామదేవత శ్రీకనకదుర్గమ్మ జాతరలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షితో పంచుకున్న ముచ్చట్లవి.
పాటంటే ప్రాణం
నాది విశాఖ జిల్లా అనకాపల్లి. చిన్నప్పటి నుంచి సినిమాలను ఎంతో ఆసక్తిగా చూసేవాడిని. మా అమ్మ, అక్క ఎక్కువగా పాటలు పాడేవారు. వాళ్లే నాకు స్ఫూర్తి. దీంతో చిన్నప్పటి నుంచి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సినీ గీతాలు పాడుతూ, పాటలు పాడేవాడిని. దీంతో అంతా మంచి గాయకుడివి అవుతావని అంటుండటంతో ఉత్సాహం పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ప్రాణం. సంగీత దర్శకుల్లో ఇళయరాజా అంటే దైవంతో సమానం. గాయకులకు వివిధ చానళ్ఉల నిర్వహిస్తున్న 'సూపర్ సింగర్', 'పాడుతా తీయగా' తదితర కార్యక్రమాలు చక్కని వేదికలుగా నిలుస్తాయి.
విజయనగరం అమ్మాయినే....
నా జన్మస్థలం విజయనగరం. విద్యాభ్యాసం హైదరాబాద్‌లో జరిగింది. విద్యల నగరం విజయనగరంలో జన్మించడం నా అదృష్టం. 1999 నుంచి సినీ నేపథ్య గాయనిగా కొనసాగుతున్నాను. సినిమాలో పాటల కన్నా ఎక్కువగా భక్తిగీతాలు, సాయిబాబా భక్తి పాటలు ఆల్బమ్స్‌కు పని చేశాను. మల్లితో పాటు పలు సినిమాల్లో పాటలు పాడాను. జల్సా, బొమ్మరిల్లు, శంకర్ దాదా జిందాబాద్, నాని సినిమాల్లో పాడిన పాటలు మంచి పేరు తీసుకొచ్చాయి. సంగీతంపై ఆసక్తి ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడమే నా లక్ష్యం.
- గోపికా పూర్ణిమ
'సింగన్న'తో పాటల ప్రయాణం
తొలుత 1997లో సింగన్న చిత్రంలో 'కలగంటి... కలగంటి పాటతో సినీ గాయకుడిగా నా ప్రస్థానం మొదలైంది. ఆది సినిమాలో నీ నవ్వుల చల్లదనాన్ని..., ఇంద్రలో ఘల్లు ఘల్లుమని..., ఠాగూర్‌లో మన్మధ... మన్మధ..., ఒక్కడులో సాహసం... శ్వాసగా..., గుడుంబా శంకర్‌లో చిట్టి నడుమనే చూస్తున్నా...తోపాటు పలు పాటలు మంచి పేరు తీసుకొచ్చాయి. కత్తి కాంతారావు సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాను. నేపథ్య గాయకుడినైనా... రాబోయే రోజుల్లో మంచి సంగీత దర్శకునిగా పేరు తెచ్చుకోవడమే నా ఆశయం. కొత్తగా వస్తున్న గాయకులు ఆవకాశాలు రానప్పుడు నిరాశ పడకూడదు. ప్రతిభ ఉంటే అవకాశాలు వెతుక్కుని వస్తాయి. అంతవరకు పట్టుదలతో కృషి చేయాలి
- మల్లికార్జున్
ఓటమే పాడిస్తుంది విజయ 'గీతం'
Published Fri, Mar 18 2016 12:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement