ఏజన్సీలో మలేరియా నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన చింతూరు మండలంలోని తులసిపాక, ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఈ సీజన్‌లో రెండు పీహెచ్‌సీల పరిధిలో మలేరియా కేసుల పెరుగుదల అధికంగా ఉందని, దానిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంట
-
వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్
చింతూరు:
ఏజన్సీలో మలేరియా నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన చింతూరు మండలంలోని తులసిపాక, ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఈ సీజన్‌లో రెండు పీహెచ్‌సీల పరిధిలో మలేరియా కేసుల పెరుగుదల అధికంగా ఉందని, దానిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని కోసం చింతూరుకు 50 పడకల ఆసుపత్రి మంజూరైందని దీనికి సిబ్బంది నియామకంతో పాటు సామగ్రి సమకూర్చాల్సి వుందన్నారు. ప్రతిరోజు మలేరియా సిబ్బంది క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలను పరిశీలించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ ఏడాది తులసిపాక పీహెచ్‌సీ పరిధిలో 400, ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీ పరిధిలో 300 మలేరియా కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. కాళ్లవాపు వ్యాధిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, త్వరలోనే ఏజన్సీలో పైలట్ ప్రాజెక్టు కింద మలేరియా రహిత గ్రామాలను తయారు చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన కాళ్లవాపు బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరించారు. ఈ సమావేశంలో డీసీహెచ్‌ఎస్ రమేష్‌కిషోర్, డీఎంవో ప్రసాద్, వైద్యాధికారి శివరామకృష్ణ పాల్గొన్నారు.