పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడు యువతి ఆత్మహత్య | Lover refused to marry a young woman commits suicide | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడు యువతి ఆత్మహత్య

Jan 9 2017 1:50 AM | Updated on Nov 6 2018 7:53 PM

పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడు యువతి ఆత్మహత్య - Sakshi

పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడు యువతి ఆత్మహత్య

రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు.. పెళ్లి చేసుకుందా మంటే కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నాడు.

నిజామాబాద్‌ క్రైం : రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు.. పెళ్లి చేసుకుందా మంటే కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిజామాబాద్‌ నగరం అంబేద్కర్‌కాలనీకి చెందిన (21) బాసర పుణ్యక్షేత్రం వద్దకు వెళ్లి నిద్రమాత్రలు మింగి ప్రియుడికి సమాచారం అందించింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

నిజామాబాద్‌ క్రైం: ప్రేమించిన యువ కుడు పెళ్లికి నిరాకరించడంతో నిజా మాబాద్‌ నగరంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన యువతి లంగాల చైతన్య(21) శనివారం ఆత్మహత్య చేసుకుంది. చైతన్య, ఆమె ఇంటి పక్కనే ఉండే వినోద్‌కుమార్‌లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చైతన్య బ్యూటీషీయన్‌గా పనిచేస్తుండగా, వినోద్‌ గతంలో మెడికల్‌షాప్‌లో పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా వినోద్‌ను చైతన్య అడుగుతోంది. పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రతిసారి వినోద్‌ ఏదో వంకతో తప్పించుకోవటంతో చైతన్య మనస్తాపానికి గురైయింది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నిర్మల్‌ జిల్లా బాసర దేవ స్థానానికి వెళ్లింది. అక్కడి నుంచి వినోద్‌కు ఫోన్‌చేసి తనను పెళ్లి చేసు కోకుంటే చనిపోతానని చెప్పింది.

వినోద్‌ స్పందించక పోవటంతో మళ్లీ ఫోన్‌ చేసి తాను నిద్రమాత్రలు మింగినట్లు చెప్పింది. వినోద్‌ వెంటనే బాసర్‌కు వెళ్లగా, ఆమె గుడి మెట్లపై కూర్చొని కనిపించింది. ఆటోలో నవీపేట ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి నిజామాబాద్‌ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే శనివారం రాత్రి 2 గంటలు దాటగా.. అక్కడి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రుల గురించి నిలదీయగా, ఫోన్‌ చేసి విషయాన్ని వారికి చెప్పాడు. వారు ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో చైతన్య చనిపోయింది. చైతన్య తండ్రి రాంచం ద్రబాబు తన కూతురి మృతికి వినోద్‌కుమారే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement