ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి | Lorry carrying sand hits auto-rickshaw, one died | Sakshi
Sakshi News home page

ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి

Nov 8 2016 10:38 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి - Sakshi

ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి

మణుగూరు పాత కాట వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

మణుగూరు: కొత్తగూడెం జిల్లా మణుగూరు పాత కాట వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబాయిగూడెంకు చెందిన ఆకుకూరల రైతులను ఎక్కించుకుని మణుగూరు వెళ్తున్న టాటా మేజిక్ ఆటోను మణుగూరు నుంచి సాంబాయిగూడెం వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement