అమ్మో లాకప్‌ | lockup death | Sakshi
Sakshi News home page

అమ్మో లాకప్‌

Aug 2 2016 11:11 PM | Updated on Aug 21 2018 5:54 PM

అమ్మో లాకప్‌ - Sakshi

అమ్మో లాకప్‌

లాకప్‌కెళ్తే ప్రాణాలతో తిరిగిరావడం కష్టమేనా. అక్కడికెళ్తే యమపురిలో అడుగుపెట్టినట్టేనా? విజయవాడ పోలీస్‌ స్టేషన్‌లలో నిందితులపై హింస బాగా పెరిగింది.

సాక్షి, విజయవాడ బ్యూరో: 
లాకప్‌కెళ్తే ప్రాణాలతో తిరిగిరావడం కష్టమేనా. అక్కడికెళ్తే యమపురిలో అడుగుపెట్టినట్టేనా? విజయవాడ పోలీస్‌ స్టేషన్‌లలో  నిందితులపై హింస బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే దుర్గాప్రసాద్‌ పోలీసుల చేతిలో చనిపోయిన  రెండో వ్యక్తి. గతంలో వ¯Œæటౌన్‌ పీఎస్‌లోని సీసీఎస్‌ భవనంలోని పై అంతస్తు నుంచి రాజమండ్రికి చెందిన ఓ వ్యాపారి పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక దూకి ప్రాణాలు తీసుకున్నాడు. 
విజయవాడ జక్కంపూడి కాలనీలో నివాసం ఉంటున్న మారిశెట్టి దుర్గాప్రసాద్‌ (23) పోలీసు చిత్రహింసల వల్లే చనిపోయాడని అతనికుటుంబ సభ్యులు, ఓపీడీఆర్‌ నిజనిర్ధరణ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. జూలై 20వ తేదీ రాత్రి ఇంటికి రాలేదు. ఆయన మిత్రులు నాగరాజు, హరిబాబు కూడా ఇంటికి చేరలేదు. తల్లి, భార్యలకు పోలీసులపైనే అనుమానం వచ్చింది. ఎందుకంటే గతంలోనూ ఇలాగే దుర్గాప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకెళ్ళి వారం రోజుల తరువాత పంపించేవారు. పోలీసుల దెబ్బల నుంచి తేరుకునేందుకు కనీసం నెలరోజులు పట్టేది. 
తల్లి, భార్య తమ పరిధిలోని స్టేషన్‌లకు వెళ్ళారు. నీ భర్తను తాము తీసుకు రాలేదంటూ పోలీసులు చెప్పారు. జూలై 30న పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. నీ భర్తకు బాగోలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పారు. అక్కడికి వెళ్ళగానే దుర్గాప్రసాద్‌ శవాన్ని భార్య, తల్లికి అప్పగించారు పోలీసులు. 
ఏం జరిగింది....
జూలై 20 సాయంత్రం దుర్గాప్రసాద్, అతని స్నేహితులు నాగరాజు, హరిబాబులు బుడమేరు కట్టపై నడుచుకుంటూ వస్తున్నారు. ఇరువురు కానిస్టేబుళ్ళు పని ఉంది అంటూ ముగ్గురినీ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వెళ్ళారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేçÙన్‌ కాంపౌండ్‌లోని సీసీఎస్‌ స్టేషన్‌లో వీరిని ఉంచారు. 20 నుంచి 28 వరకు సీసీఎస్‌ స్టేషన్‌లోనే ఉంచి దుర్గాప్రసాద్‌పై నిత్యం థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు,  ఆ తరువాత సీసీఎస్‌ పోలీసులు నాగరాజు, హరిబాబులను వేరే కేసుల్లో నిందితులుగా పేర్కొని రిమాండ్‌కు పంపించారు. తీవ్రమైన దెబ్బల వల్ల దుర్గాప్రసాద్‌ పేగులు, గుండె డ్యామేజీ కావడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో పోలీసులు వన్‌టౌన్‌లోని ఒక ప్రైవేట్‌ వైద్య శాలకు (నిత్యం పోలీసులు నిందితులకు వైద్యం చేయించే ప్రైవేట్‌ ఆస్పత్రి) జూలై 30 తరలించారు. అప్పటికే చావుకు దగ్గరైన దుర్గాప్రసాద్‌కు వైద్యం చేయడం సాధ్యం కాదంటూ వైద్యుడు తేల్చి చెప్పారు. æహడావుడిగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతిచెందాడు.  దుర్గాప్రసాద్‌ రాత్రి తొమ్మిది గంటలకు చనిపోగా 11 గంటలకు బంధువులు ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. కొందరు పోలీసు పెద్దలు వారిని నయానో భయానో నచ్చజెప్పి శవాన్ని ఇంటికి తీసుకుపోయేలా చేశారు. 31వ తేదీన శవాన్ని ఖననం చేసే సమయంలోనూ పోలీసులు మోహరించారు.
బంధువులతో సెటిల్‌మెంట్‌...
చనిపోయిన వ్యక్తి తిరిగి రాడని, అల్లరి చేస్తే పోలీసుల నుంచి మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని బందువులకు పోలీసులు సర్దిచెప్పారు. మృతుని భార్యకు రూ. 2.50 లక్షలు, తల్లికి రూ. లక్ష ఇచ్చే విధంగా ఒప్పందం చేసి గుట్టుచప్పుడు కాకుండా కేసును మూసివేశారు ఖాకీలు. అనుమానాస్పద మరణంలో కచ్చితంగా నిర్వహించాల్సిన పోస్టుమార్టం కూడా జరపలేదు. పీఎం చేస్తే నిజాలు బయటపడతాయనే భయమే కారణం. 
గతంలో గన్నవరం           యువకుడు కూడా 
ఏడాది కిందట పెనమలూరు పోలీసులు దొంగతనం కేసులో గన్నవరానికి చెందిన పుల్లా రమేష్‌ అనే యువకుణ్ని తీవ్రంగా హింసించడంతో అతడు చనిపోయాడు. తాము పట్టుకోబోతే కొంగల మందు మింగాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగానే మరణించాడని అప్పటి సీఐ సీహెచ్‌ జగన్మోçßæ¯Œæరావు చెప్పారు. దర్యాప్తు తీరుల్లో ఎన్నో ఆధునిక విధానాలు వస్తున్నా వాటిని పాటించకుండా, తమకు తెలిసిన చిత్రహింసలనే నిందితులపై ప్రయోగిస్తున్నారు సిటీ పోలీసులు. ఫలితంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 
మాకు సంబంధం లేదు 
సీసీఎస్‌ ఏడీసీపీ వెల్లడి
దుర్గాప్రసాద్‌ మరణంతో పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని విజయవాడ క్రైమ్స్‌ (సీసీఎస్‌) అదనపు డిసిపి రామకోటేశ్వరరావు చెప్పారు. దుర్గాప్రసాద్‌ లాకప్‌డెత్‌ విషయమై సాక్షి డిసిపిని వివరణ కోరగా అతని మరణంతో పోలీసులకు ప్రమేయం లేదని చెప్పడం గమనార్హం. అతన్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్ళలేదని, అతను ఎలా మరణించిందీ తమకు తెలియదని ఆయన చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement