కేంద్ర పోలీసు అవార్డులకు రాష్ట్ర జాబితా

కేంద్ర పోలీసు అవార్డులకు రాష్ట్ర జాబితా - Sakshi


సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా ఇచ్చే ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం), రాష్ట్రపతి పోలీస్ మెడల్ (పీపీఎం) అవార్డులకు సంబంధించి 24 మంది పోలీసు అధికారులతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించింది. ఎంపికైన అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను అందజేస్తారు. ఐపీఎం కేటగిరిలో పోలీసు అధికారులను, పీపీఎం కేటగిరిలో 8 మంది పోలీసు అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ జాబితా పంపించింది. ఇందుకు సంబంధించి ఐపీఎం కేటగిరిలోని ముగ్గురు అధికారులు, పీపీఎం కేటగిరిలో ఐదుగురికి సంబంధించిన వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్) ను పంపింది. మిగతా వారికి సంబంధించిన ఏసీఆర్‌ను కూడా త్వరలో పంపనుంది. రెండు విభాగాల్లో కలిపి 8 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు.



 ఇండియన్ పోలీస్ మెడల్స్ (ఐపీఎం) కోసం కేంద్రానికి పంపిన పేర్లు

 1.ఎం.స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, డీఐజీ గ్రేహౌండ్స్, హైదరాబాద్

 2. సి.రవి వర్మ, ఐపీఎస్, డీఐజీ,

 సైబర్ క్రైం సీఐడీ

 3. ఎంకె సింగ్, ఐపీఎస్, ఐజీ

 (లా అండ్ ఆర్డర్)

 4. పి.రవీందర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ, మెదక్

 5. మేకల భీంరావు, డీఎస్పీ, పీటీసీ,

 కరీంనగర్

 6. కొట్టం శ్యాం సుందర్, డీఎస్పీ, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్

 7. కటకం మురళీధర్, డీఎస్పీ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్

 8. కె.శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్

 9. వి.శ్యాంబాబు, ఇన్‌స్పెక్టర్, సీసీఎస్,

 హైదరాబాద్

 10. పి.రవీందర్, ఎస్‌ఐ డీఎస్‌బీ,

 నిజామాబాద్

 11. యండమూరి వాలి బాబ, ఎస్‌ఐ,

  జీడీకె-2, కరీంనగర్

 12. ఎన్.మారుతి రావు, ఎస్‌ఐ, ఎస్ సెల్, ఇంటెలిజెన్స్

 13. మహ్మద్ జాఫర్, ఎస్‌ఐ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్

 14. డి.కిషన్ జీ, ఏఆర్ ఎస్‌ఐ,

 కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్

 15. ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఆర్ ఎస్‌ఐ,

 మహబూబ్‌నగర్

 16. షేక్ అబ్దుల్లా, హెడ్‌కానిస్టేబుల్,

 ఆమన్‌గల్, మహబూబ్‌నగర్

 

 ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్

 (పీపీఎం) కోసం పంపిన పేర్లు


 1. ఎం.గోపికృష్ణ, ఐపీఎస్, అడిషనల్ డీజీపీ, పోలీస్ సంస్కరణలు

 2. అంజని కుమార్, ఐపీఎస్, ఏసీపీ

 హైదరాబాద్

 3. ఎన్.సూర్యనారాయణ, ఐపీఎస్, డెరైక్టర్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్

 4. ఎం.శివప్రసాద్, ఐపీఎస్, జాయింట్ కమిషనర్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్

 5. టి.వి.శశిధర్‌రెడ్డి, ఐపీఎస్, జాయింట్ కమిషనర్, సైబరాబాద్

 6. యు. రామ్మోహన్, అడిషనల్ ఎస్పీ, సైబర్ క్రైం, సీఐడీ

 7. జె.దేవేందర్‌రెడ్డి, డీఎస్పీ, ఇంటెలిజెన్స్

 8. జె.అమరేందర్‌రెడ్డి, జాయింట్ సీపీ, కోఆర్డినేషన్, హైదరాబాద్

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top