రిఫరీగా లిమ్మేష్‌కుమార్‌ | limmesh kumar as a referee to ball badminton tourney | Sakshi
Sakshi News home page

రిఫరీగా లిమ్మేష్‌కుమార్‌

Feb 7 2017 7:05 PM | Updated on Sep 5 2017 3:09 AM

62వ జూనియర్స్‌ జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు రిఫరీగా లిమ్మేష్ కుమార్ ఎంపికయ్యారు

కవిటి(ఇచ్ఛాపురం): మండలంలోని పెద్దమెళియాపుట్టుగ జెడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ లిమ్మేష్‌కుమార్‌ పండా ఈ నెల ఎనిమిది నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లిలో జరగనున్న 62వ జూనియర్స్‌ జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సమాచారం వచ్చింది. పలుమార్లు రిఫరీగా ఎంపికైన తనకు మరోసారి అవకాశం లభించడంపై కవిటి పంచాయతీ సర్పంచ్‌ పాండవ చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement