ఆన్‌లైన్‌లో మోసం | lies in online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో మోసం

Sep 30 2016 11:39 PM | Updated on Sep 4 2017 3:39 PM

ఆన్‌లైన్‌లో లాటరీ తగిలిందంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి నమ్మబలకడంతో ఓ బాధితుడు మోసపోయాడు. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేట మండలం ఇప్పటూర్‌కు చెందిన శివకు వారం రోజుల క్రితం ఆన్‌లైన్‌లో ‘మీకు ధనలక్ష్మి యంత్రం లాటరీ తగిలింది. మీరు చేయాల్సిందల్లా మా పేరుతో రూ.3,500లకు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీసి పంపించండి.. మీకు రెండు తులాల బంగారంతో చేసిన ధనలక్ష్మి యంత్రం, స్వామివారి పాదుకలు, వాహనం లభిస్తాయి..’ అంటూ

నవాబుపేట : ఆన్‌లైన్‌లో లాటరీ తగిలిందంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి నమ్మబలకడంతో ఓ బాధితుడు మోసపోయాడు. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేట మండలం ఇప్పటూర్‌కు చెందిన శివకు వారం రోజుల క్రితం ఆన్‌లైన్‌లో  ‘మీకు ధనలక్ష్మి యంత్రం లాటరీ తగిలింది. మీరు చేయాల్సిందల్లా మా పేరుతో రూ.3,500లకు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీసి పంపించండి.. మీకు రెండు తులాల బంగారంతో చేసిన ధనలక్ష్మి యంత్రం, స్వామివారి పాదుకలు, వాహనం లభిస్తాయి..’ అంటూ ఎక్కడి నుంచో కాల్‌ వచ్చింది. వారు ఫోన్‌లో చెప్పిన చిరునామాకు డీడీ తీసి పంపగా కేవలం ఇత్తడి పూతతో చేసిన యంత్రం, పాదుకలు వచ్చాయి. అలాగే ఒక స్మార్ట్‌ ఫోన్‌ సైతం లాటరీలో వచ్చిందని చెప్పిన వారు దానిని పంపకుండా మోసం చేశారు. కాగా ఈ విషమై అక్కడి నంబరుకు కాల్‌ చేస్తే సరిగా సమాధానం రాలేదు. దీంతో చివరకు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement