తిరుమలలో సంచరిస్తున్న చిరుతలను బంధించలేమని డీఎఫ్వో శివరాంప్రసాద్ స్పష్టం చేశారు.
తిరుమల : తిరుమలలో సంచరిస్తున్న చిరుతలను బంధించలేమని డీఎఫ్వో శివరాంప్రసాద్ స్పష్టం చేశారు. వాటిని దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తామన్నారు. శుక్రవారం తిరుమలలో డీఎఫ్వో శివరాంప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... కొన్ని రోజులపాటు భక్తులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయట తిరగవద్దు అని ఆయన భక్తులకు సూచించారు. తిరుమలలో మూడు చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.