ఎల్‌ఈడీ సోలార్ స్ట్రీట్‌లైట్లు

ఎల్‌ఈడీ సోలార్ స్ట్రీట్‌లైట్లు - Sakshi


రాష్ట్రంలో తొలిసారిగా ఇనుగుర్తిలో.. కేసముద్రం: తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఫోర్‌ఆర్మ్ 24 వాట్స్ హైపవర్ ఎల్‌ఈడీ సోలార్ స్ట్రీట్ లైట్‌లను సోమవారం ఏర్పాటు చేశారు. సెన్సార్ సిస్టం ద్వారా ఈ సోలార్ లైట్లు పనిచేస్తాయని, సూర్యుడి వెలుగులో ఈ లైట్లు ఆరిపోతాయని, చీకటి పడగానే వాతంతటవే వెలుగుతాయని ఇందన వనరుల అభివృద్ధి సంస్థ డీవో కృష్ణారెడ్డి విలేకరులకు తెలిపారు. కాగా ఎంపీ నిధుల నుంచి ఈ గ్రామానికి నాలుగు స్ట్రీట్‌లైట్‌లు మంజూరయ్యాయని, ప్రస్తుతానికి ఒక లైట్‌ను ఏర్పాటు చేశామన్నారు.ఒక్క స్ట్రీట్‌లైట్  ధర రూ.1,39,350 ఉంటుం దని, దీనికి నాలుగువైపులా బల్బుటుంటాయన్నారు. మొదటిసారిగా మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ స్ట్రీట్‌లైట్‌లను మన రాష్ట్రంలో ఇనుగుర్తిలోనే ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీటిని దసరానాడు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top