136 గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు | led bulbs in 136 villages | Sakshi
Sakshi News home page

136 గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు

Feb 16 2017 10:26 PM | Updated on Jun 1 2018 8:39 PM

రాష్ట్ర ప్రభుత్వం 136 గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వరమ్మ తెలిపారు.

అనంతపురం సిటీ : రాష్ట్ర ప్రభుత్వం 136 గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వరమ్మ తెలిపారు. ఈ మేరకు గురువారం అనుమతి వచ్చిందని   తెలిపారు. బల్బుల ఏర్పాటుకు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు తెలిపారు.136 గ్రామాల్లో ఎన్ని విద్యుత్‌ స్తంభాలు, పని చేస్తున్న మీటర్లు, వాటి బిల్లులు వస్తున్నాయా? లేదా లాంటి విషయాలను ఆరాతీయాలని చెప్పినట్లు తెలిపారు.

ఈ నెల 20 లోపు ఈ నివేదికను పంచాయతీ కార్యదర్శులు అందజేయాల్సి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు పంచాయతీ కార్యాలయాలు ఇతర వినియోగాలకు విద్యుత్‌ వాడకున్నా బిల్లులు చెల్లిస్తూ వచ్చారన్నారు.తక్షణం అనవసరపు విద్యుత్‌ కనెక‌్షన్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చీకట్లో మగ్గుతున్న గ్రామాలను గుర్తించి అక్కడ ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement