అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎద్దులదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది.
కౌలు రైతు ఆత్మహత్య
Dec 25 2016 11:34 PM | Updated on Nov 6 2018 7:53 PM
ఎద్దులదొడ్డి(తుగ్గలి): అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎద్దులదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాట రాజు (30) ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది వర్షాభావంతో సాగు చేసిన కంది, వేరుశనగ పంటలు పండక తీవ్రంగా నష్టపోయాడు. పెట్టుబడికి దాదాపు రూ.3.10 లక్షలు అప్పులు చేయగా.. తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అక్కడ కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య లలితమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తుగ్గలి ఎస్‌ఐ కేశవ తెలిపారు.
Advertisement
Advertisement