వడదెబ్బతో కూలీ మృతి | labour dies of sun strokes | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో కూలీ మృతి

Apr 24 2017 11:46 PM | Updated on Sep 5 2017 9:35 AM

తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన శివప్రసాద్‌ (28) అనే కూలీ వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు.

తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన శివప్రసాద్‌ (28) అనే కూలీ వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శివప్రసాద్‌ తాడిపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య సరోజ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement