‘పేట’ కార్యక్రమాలను అభినందించిన కేటీఆర్‌ | ktr appriciate to the programes | Sakshi
Sakshi News home page

‘పేట’ కార్యక్రమాలను అభినందించిన కేటీఆర్‌

Aug 1 2016 7:51 PM | Updated on Aug 30 2019 8:37 PM

‘పేట’ కార్యక్రమాలను అభినందించిన కేటీఆర్‌ - Sakshi

‘పేట’ కార్యక్రమాలను అభినందించిన కేటీఆర్‌

సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమాలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన స్టేట్‌ లెవల్‌ కాన్ఫరెన్స్‌లో అభినందించారు.

ఈ సందర్భంగా సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక, కమిషనర్‌ వడ్డె సురేందర్‌లు కార్యక్రమంలో ప్రసంగిస్తూ పేటలో చేపట్టి అమలు చేస్తున్న ఉండమ్మా బొట్టుపెడతా, మన వార్డుకు మంచి రోజులు, మన విధి–మన వీధి, రెవెన్యూ సదస్సులు తదితర కార్యక్రమాలను వివరించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ చైర్‌పర్సన్, కమిషనర్‌లను అభినందించి.. కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట మున్సిపాలిటీలో చేపట్టిన పనులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కరీంనగర్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌లో వైస్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల లక్ష్మితో పాటు మున్సిపల్‌ అధికారులు  పాల్గొన్నారు.  
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement