కృష్ణా పుష్కరాలకు పోలీసు సిబ్బంది
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి జాతీయ రహదారి మీద వాహనాల దారి మళ్లింపు చేస్తున్నట్టు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
జాతీయ రహదారిపై రూటు మళ్లింపు
రాజమహేంద్రవరం క్రైం :
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి జాతీయ రహదారి మీద వాహనాల దారి మళ్లింపు చేస్తున్నట్టు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు దివాన్ చెరువు వద్ద నుంచి గామన్ బ్రిడ్జి(వైఎస్సార్ వారధి) మీదుగా కొవ్వూరు, అశ్వారరావు పేట, ఖమ్మం మీదుగా హైదారాబాద్‌కు దారి మళ్లిస్తున్నామని తెలిపారు. అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు రాజమహేంద్రవరం మీదుగా వేమగిరి, రావుల పాలెం, సిద్ధాంతం, ఓగొలు మీదుగా చెన్నైకు తరలిస్తామని తెలిపారు. ఈ నెల 12న కృష్ణ పుష్కరాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ట్రాఫిక్ దారి మళ్లింపు 12 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు విషయాన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన లారీ ఓనర్లకు, డ్రైవర్లకు, ట్రాన్స్‌పోర్టు యజమానులకు, లారీ యజమానులకు స్థానికలారీ యూనియన్ నాయకులు తెలియజేయాలని సూచించారు.
750 మంది సిబ్బంది : కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నుంచి 750 మంది పోలీస్‌లను పంపించినట్టు ఎస్పీ రాజ కుమారి తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్, ట్రాన్స్‌పోర్టు యజమానులు, లారీ యజమానులు పాల్గొన్నారు.