ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు విదేశీ టూర్లు చేయడమే తప్ప... రాష్ట్రానికి పైసా పెట్టుబడి కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. బ్యూటిపికేషన్ పేరుతో ఆలయాలను తొలగించడం చాలా దుర్మార్గమ ఆయన మండిపడ్డారు. దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని కొయ్య ప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు.