సంబరాలు విజయవంతం చేయాలి | konaseema festival | Sakshi
Sakshi News home page

సంబరాలు విజయవంతం చేయాలి

Feb 10 2017 12:46 AM | Updated on Mar 21 2019 8:35 PM

కోనసీమలో ఒకేసారి మూడు ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 24 నుంచి 26 వరకు ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోనసీమ ఉత్సవాలు జరగనుండగా, అదే రోజున ఆరంభమై 27వ తేదీ వరకు ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జాతీయ వాలీబాల్‌ పోటీలు, ఇదే

  • మురమళ్లలో కోనసీమ.. ఎస్‌.యానాంలో బీచ్‌ఫెస్టివల్‌
  • గొల్లవిల్లిలో జాతీయ వాలీబాల్‌ పోటీలు.. 
  • ఉప ముఖ్యమంత్రి రాజప్ప సమీక్ష
  • అమలాపురం : 
    కోనసీమలో ఒకేసారి మూడు ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 24 నుంచి 26 వరకు ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోనసీమ ఉత్సవాలు జరగనుండగా, అదే రోజున ఆరంభమై 27వ తేదీ వరకు ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జాతీయ వాలీబాల్‌ పోటీలు, ఇదే మండలం ఎస్‌.యానాంలో 25, 26 తేదీల్లో బీచ్‌ ఫెస్టివల్‌ జరగనున్నాయి. గత ఏడాది కోనసీమ ఉత్సవాలు జరగ్గా, గడిచిన ఐదేళ్ల నుంచి మహాశివరాత్రి రోజున గొల్లవిల్లిలో వాలీబాల్‌ పోటీలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ రెండు మెగా ఈవెంట్లు ఒకేసారి నిర్వహంచడంతోపాటు అదనంగా ఎస్‌.యానాంలో బీచ్‌ఫెస్టివల్‌ను తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ మూడు ఉత్సవాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌లు గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష జరిపారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ప్రత్యేకాధికారి భీమశంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. రాజప్ప మాట్లాడుతూ కోనసీమలో పర్యాటకాభివృద్ధిలో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, వీటిని విజయవంతం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నమూనా దేవాలయాలకు విస్తృతస్థాయి ప్రచారం చేయాలని రాజప్ప సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్, డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో తయారవుతున్న ఉత్పత్తులకు మంచి ప్రచారం కల్పించినట్టవుతుందన్నారు. కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ను చూసి విశాఖలో బీచ్‌ఫెస్టివల్‌ నిర్వహించారన్నారు. అదే ఉత్సాహంతో అధికారులంతా కలిసి కోనసీమ ఉత్సవాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈసారి ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్వహిస్తామన్నారు. ఎస్‌.యానాం, చిర్రయానాం, మాగసానితిప్ప, అంతర్వేది వంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాలపై మూడు, నాలుగు రోజుల్లో తుదిరూపం వస్తుందన్నారు. లోకల్‌ టాలెంట్‌కు అవకాశం ఇచ్చేలా కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. ఈసారి వాటర్‌ స్పోర్ట్‌్సను ఏర్పాటు చేస్తామన్నారు. ముమ్మిడివరం, అమలాపురం ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, అయితాబత్తుల ఆనందరావు, మున్సిపల్‌ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement