కాకినాడ నాకెంతో నచ్చింది.. | kkd very beautiful city | Sakshi
Sakshi News home page

కాకినాడ నాకెంతో నచ్చింది..

Jul 29 2016 12:33 PM | Updated on Aug 17 2018 2:31 PM

కాకినాడ నాకెంతో నచ్చింది.. - Sakshi

కాకినాడ నాకెంతో నచ్చింది..

కాకినాడ చాలా అందమైన, ఆకర్షణీయమైన నగరమని సినీ హీరోయిన్‌ అర్చనా వేద అన్నారు.

కాకినాడ కల్చరల్‌ : కాకినాడ చాలా అందమైన, ఆకర్షణీయమైన నగరమని సినీ హీరోయిన్‌ అర్చనా వేద అన్నారు. స్థానిక మెయిన్‌రోడ్లో ఏర్పాటు చేసిన కమల్‌ వాచ్‌ షోరూం ప్రారంభోత్సవానికి గురువారం వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. గతంలో చాలా సార్లు సినిమా షూటింగ్‌ల కోసం కాకినాడ నగరం, కోనసీమ ప్రాంతాలను సందర్శించానన్నారు. కాకినాడ ప్రజలు తనపై చూపుతున్న అభిమానాన్ని మరువలేనని, ఇక్కడకు మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుందని చెప్పారు. తన నటన తెలుగుప్రేక్షకులకు నచ్చుతోందన్నారు. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తున్నానని, తెలుగులో కూడా మంచి చిత్రాలు చేతిలో ఉన్నాయని తెలిపారు.
 
బీవీసీలో సినీ సందడి
అల్లవరం : రామా రీల్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ గురువారం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రారంభమైంది. తమిళ హీరో భరత్‌ నాయకుడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ను బీవీసీ అధినేత బోనం కనకయ్య క్లాప్‌ కొట్టి ప్రారంభించారు.  ప్రేమ కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా శ్వేతాశర్మ, ప్రధాన పాత్రల్లో నరేష్, ఆలీ, రాశి, అవినాష్, శివరాం నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం రవీంద్ర భార్గవ్, నిర్మాత పూదోట సుధీర్‌కుమార్, సంగీతం విజయ కురాకుల, మేనేజర్‌ రుపేష్‌. షూటింగ్‌ ప్రారంభ కార్యక్రమంలో గనిశెట్టి రమణలాల్, గిడుగు భాస్కరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement