ఖోఖో విజేత పాలమూరు | kho,kho champion mahaboobnagar | Sakshi
Sakshi News home page

ఖోఖో విజేత పాలమూరు

Sep 13 2016 12:09 AM | Updated on Oct 8 2018 5:07 PM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో జరిగిన స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–17 ఖోఖో టోర్నీ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో జిల్లా జట్టు 4–2 పాయింట్ల తేడాతో ఖమ్మంపై విజయం సాధించింది.

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో జరిగిన స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–17 ఖోఖో టోర్నీ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో జిల్లా జట్టు 4–2 పాయింట్ల తేడాతో ఖమ్మంపై విజయం సాధించింది. జిల్లా జట్టు విజేతగా నిలవడంపై ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్, సత్యనారాయణ, విజేందర్, యాదయ్య, మొగులాల్‌ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
జాతీయస్థాయికి క్రీడాకారులు
ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. నందిని  (వెల్జాల), కృష్ణమ్మ (సూరారం), కృష్ణవేణి (కల్వకుర్తి), సికిందర్‌ (కల్వకుర్తి) టోర్నీలో రాణించి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిని పలువురు అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement