కరీంనగర్‌లో కార్డెన్ సెర్చ్ | karimnagar Police held cardon and search operation in city | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో కార్డెన్ సెర్చ్

Nov 3 2016 9:25 AM | Updated on Sep 4 2017 7:05 PM

నగరంలోని శివారుకాలనీలలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

కరీంనగర్: నగరంలోని శివారుకాలనీలలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్‌నగర్, రెడ్డి కళాశాల, అపోలో హస్పిటల్ ఏరియాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 50 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టారు.

సరైన పత్రాలు లేని బైక్‌లను ఈ నెల 10 తేదిలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీపీ ఆదేశించారు. అసాంఘీక కార్యకలాపాలను అరికట్టడానికి చేపట్టిన కార్డన్ సెర్చ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement