ప్రత్యేక శిక్షణకు కప్పట్రాళ్ల మహిళలు | kappatralla womens for special training | Sakshi
Sakshi News home page

ప్రత్యేక శిక్షణకు కప్పట్రాళ్ల మహిళలు

Apr 11 2017 12:15 AM | Updated on Sep 5 2017 8:26 AM

జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ చొరవతో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో ప్రత్యేక శిక్షణ పొందేందుకు 35 మంది కప్పట్రాళ్ల మహిళలు ఎంపికయ్యారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) :  జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ చొరవతో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో ప్రత్యేక శిక్షణ పొందేందుకు  35 మంది కప్పట్రాళ్ల మహిళలు ఎంపికయ్యారు. వారందరూ సోమవారం హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎస్పీ తన క్యాంపు కార్యాలయంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..కప్పట్రాళ్లలో ప్రతి మహిళ సొంతంగా ఆదాయ వనరులను సమకూర్చుకోవాలన్నారు. ఇందుకోసం తనవంతు సాయం అందిస్తానని తెలిపారు. కేవలం వ్యవసాయమే కాకుండా ఇతర వనరులపై దృష్టి సారించాలని సూచించారు. కప్పట్రాళ్ల మహిళలు హైదరాబాద్‌కు శిక్షణ కోసం వెళ్లేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని టీజీవీ గ్రూపు ద్వారా సమకూర్చుతామని ఆ సంస్థల చైర్మన్‌ టీజీ భరత్‌ అన్నారు. అనంతరం 35 మంది మహిళలతో కూడిన అమరజ్యోతి వాహనాన్ని జెండా ఊపి హైదరాబాద్‌కు ఎస్పీ, టీజీ భరత్‌ సాగనంపారు. కార్యక్రమంలో సెర్పు ఆర్గనైజర్‌ విజయభారతి, కోడుమూరు వ్యవసాయాధికారి అక్బర్‌బాషా, గ్రామజ్యోతి సోషల్‌ ఆర్గనైజర్‌ నారాయణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement