నెట్టికంటున్ని దర్శించుకున్న జాయింట్‌ కలెక్టర్‌ | joint collector in kasapuram temple | Sakshi
Sakshi News home page

నెట్టికంటున్ని దర్శించుకున్న జాయింట్‌ కలెక్టర్‌

Nov 6 2016 12:01 AM | Updated on Sep 4 2017 7:17 PM

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం శనివారం కుటుంబ సమేతంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

గుంతకల్లు రూరల్‌ : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం శనివారం కుటుంబ సమేతంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.   శుక్రవారం రాత్రి ఆలయానికి చేరుకున్న జేసీ దంపతులకు ఆలయ అధికారులతోపాటు, తహసీల్దార్‌ హరిప్రసాద్‌ ఇతర రెవెన్యూ అధికారులు  స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి ఆలయ విడిది గృహంలో నిద్ర చేసిన జేసీ దంపతులు, శనివారం వేకువ జామున ఆలయంలో స్వామివారికి నిర్వహించే అభిషేకం కార్యక్రమానికి హాజరయ్యారు. అర్చకులు జేసీ కుటుంబ సభ్యుల పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement