జేఎన్‌టీయూకే విద్యార్థి అనుమానాస్పద మృతి | JNTUK student suspect of death in Kakinada | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూకే విద్యార్థి అనుమానాస్పద మృతి

Feb 13 2016 12:00 AM | Updated on Sep 3 2017 5:31 PM

జేఎన్‌టీయూ-కాకినాడలో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్న కోటా రాహుల్ (23) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

కాకినాడ సిటీ : జేఎన్‌టీయూ-కాకినాడలో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్న కోటా రాహుల్ (23) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం గంపలగూడేనికి చెందిన రాహుల్ కాకినాడలోని ఒక ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువు సాగిస్తున్నాడు. ఉదయం బాత్‌రూముకు వెళ్లిన రాహుల్ అక్కడే పడిపోయి ఉండడాన్ని రూమ్‌మేట్స్ గుర్తించారు. అతడిని వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)కి తీసుకువెళ్లారు. అప్పటికే రాహుల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న రాహుల్ లో బీపీతో పడిపోయి ఉండవచ్చని వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని జీజీహెచ్ అవుట్‌పోస్ట్ పోలీసులు మార్చురీకీ తరలించారు. సహచర విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేఎన్‌టీయూకే అధికారులు రాహుల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement