అనంతపురం జేఎన్‌టీయూలో కీచకపర్వంపై వీసీ సర్కార్, రిజిస్ట్రార్ కృష్ణయ్య స్పందించారు.
కదిరి: అనంతపురం జేఎన్‌టీయూలో కీచకపర్వంపై వీసీ సర్కార్, రిజిస్ట్రార్ కృష్ణయ్య స్పందించారు. ఎంబీఏ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్ తమ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదని వారు తెలిపారు. 2013లో ఒక రోజు మాత్రమే విద్యార్థులకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారని వెల్లడించారు. ఆ తర్వాత ఎంబీఏ విద్యార్థిని, సుశీల్ కుమార్ మధ్య ఏం జరిగింతో తమకు తెలియదని చెప్పారు. ఈ వ్యవహారంతో యూనవర్సిటీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కాగా, సునీల్ కుమార్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఎంబీఏ విద్యార్థిని మంగళవారం రాత్రి కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా చెప్పినట్టు వినకుంటే యాసిడ్ పోస్తానంటూ తనను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో లైంగిక వేధింపులకు గురిచేశాడని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.