ఏజెన్సీలోని గిరిజనులు భక్తి భావంతో మెలగాలని, వారి సంస్కృతి, సంప్రదాయాలను పాటించి రానున్న తరాలవారికి ఆదర్శంగా నిలవాలని త్రిదండి శ్రీమన్నారా యణ చిన జీయర్‌స్వామి అన్నారు. స్థానిక నారాయణగిరిపై శుక్రవారం జరిగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిమిత్తం
-
చిన జీయర్‌స్వామి
రంపచోడవరం :
ఏజెన్సీలోని గిరిజనులు భక్తి భావంతో మెలగాలని, వారి సంస్కృతి, సంప్రదాయాలను పాటించి రానున్న తరాలవారికి ఆదర్శంగా నిలవాలని త్రిదండి శ్రీమన్నారా యణ చిన జీయర్‌స్వామి అన్నారు. స్థానిక నారాయణగిరిపై శుక్రవారం జరిగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిమిత్తం రంపచోడవరం వచ్చిన ఆయన గురువారం స్థానిక వాల్మీకిపేటలోని వా ల్మీకి విగ్రహం వద్ద కొబ్బరికాయ కొ ట్టి పూలమాలలు వేశారు. రామాయణం రచించిన వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సర్పంచ్ వై.నిరంజనీదేవిని అభినందించారు. వాల్మీకి ప్రపంచానికే రాముని గురించి చాటి చెప్పిన మహర్షి అన్నారు. స్థానికులు చినజీయర్‌స్వామికి ఘన స్వాగతం పలికారు. న్యాయవాది ఎంవీఆర్ ప్రకాష్, సాదిక్ మాస్టారు, భవానీశంకర్, భూచక్రం ,ప్రియబాబు, దేవీ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.