తినడానకి తిండీ లేదు.. నీళ్లూ లేవు! | Jeddah out prison in 2 thousand people Indian workers | Sakshi
Sakshi News home page

తినడానకి తిండీ లేదు.. నీళ్లూ లేవు!

Aug 8 2016 1:51 AM | Updated on Sep 4 2017 8:17 AM

తినడానకి తిండీ లేదు.. నీళ్లూ లేవు!

తినడానకి తిండీ లేదు.. నీళ్లూ లేవు!

సౌదీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో కంపెనీలు మూతపడగా, వీసా, పాస్‌పోర్టు సరిగాలేని రెండువేల మంది భారతీయ కార్మికులు రోడ్డుపాలవగా...

జెడ్డా ఔట్ జైలులో 2వేల మంది భారతీయ కార్మికుల నరకయాతన
మోర్తాడ్: సౌదీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో కంపెనీలు మూతపడగా, వీసా, పాస్‌పోర్టు సరిగాలేని రెండువేల మంది భారతీయ కార్మికులు రోడ్డుపాలవగా, వారిని జైళ్లకు తరలించారు. జెడ్డా ఔట్‌జైలులో బందీలుగా ఉన్న కార్మికులు మూడు రోజులుగా తినడానికి తిండి దొరక్క, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సౌదీలో పరిస్థితుల్ని రియాద్‌లో రిసార్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌వాసి పాలకుర్తి అజయ్‌గుప్తా ఫోన్ ద్వారా తెలిపారు.

వారి ఇబ్బందులపై స్పందించిన విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. కార్మికుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ సౌదీలోని మన రాయబార కార్యాలయం అధికారులు అనుసరిస్తున్న తీరు పూర్తి భిన్నంగా ఉంది.  మంత్రి స్పందించిన తరువాత ఒకటి, రెండు రోజులు భోజన సదుపాయం, నీటి వసతి కల్పించారని, ఆ తర్వాత మళ్లీ  పట్టించుకోవడం లేదని జైళ్లలో మగ్గుతున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులను స్వదేశానికి రప్పించే చర్య లు చేపట్టాలని వారి కుటుంబీకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement