‘ప్రతిపక్ష నేతగా ఎప్పటికీ ఆయనే ఉండాలి’ | janareddy react on hareesh rao comments | Sakshi
Sakshi News home page

‘ప్రతిపక్ష నేతగా ఎప్పటికీ ఆయనే ఉండాలి’

Jan 5 2017 2:56 AM | Updated on Sep 5 2017 12:24 AM

‘ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండేలా ఆయనను ఆశీర్వదించండి’ అని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డిని ఉద్దేశించి నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సరదాగా వ్యాఖ్యానించారు.

వచ్చేసారి నువ్వే ప్రతిపక్ష నేత అవుతావేమో: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ‘ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండేలా ఆయనను ఆశీర్వదించండి’ అని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డిని ఉద్దేశించి నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి దీటుగా జానారెడ్డి స్పందిస్తూ ‘ప్రజలు ఎప్పుడు, ఎట్లా తీర్పునిస్తారో తెలియదు. వచ్చేసారి ప్రతిపక్ష నేత స్థానంలో నువ్వే ఉంటావేమో. అప్పటివరకు ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు’ అని వ్యాఖ్యానించారు.

ధర్మపురి నుంచి కొంతమంది అర్చకులు సీఎం కేసీఆర్‌ ను కలవడానికి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావును కలసి, శాలువాను కప్పి, ఆశీర్వదించారు. హరీశ్‌తో కలసి చాంబర్‌ నుంచి బయటకు వచ్చిన అర్చకులకు సభకు వస్తున్న జానారెడ్డి ఎదురయ్యారు. దీంతో జానారెడ్డికి కూడా శాలువాను కప్పి ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement