జలసిరి.. ఉత్సాహం ఆవిరి


 • అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారుల కుదింపు

 • ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ∙

 • ఉచిత మోటారు హామీ నమ్మి మోసపోయామని ఆవేదన

 • పంచపాండవులు మంచం కోళ్లలా ముగ్గురు అని రెండేళ్లు చూపి ఒకటి అంకె వేశాడట వెనుకటి ఒకడు! జిల్లాలో ఎన్టీఆర్‌ జలసిరి పథకం అమలు తీరు కూడా అలాగే ఉంది. మోటారు బోర్లు ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి 14,106 దరఖాస్తులు స్వీకరించి, 13,598 మందిని అర్హులుగా గుర్తించి, 3,844 పాయింట్లకే అనుమతి ఇచ్చి, 592 మంది బోర్లను తవ్వుకొంటే 259 మంది మాత్రమే ఇప్పటికే బోర్లను ఏర్పాటు చేసుకొనేలా వ్యవహరించిన సర్కారు వైఖరే ఇందుకు తార్కాణం. ఆర్భాటంగా పథకాలను ప్రారంభించడం.. ఆర్థిక భారం భరించలేక ఆనక నిబంధనల పేరుతో కొద్దిమందికి మాత్రమే వర్తించేలా చేయడం అలవాటు చేసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా ఎన్టీఆర్‌ జలసిరి పేరుతో రైతుల ఉత్సాహాన్ని ఆవిరి చేసింది.

   

  ఆలమూరు : 

  ఎన్టీఆర్‌ జలసిరిలో రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా నిబంధనల మార్పు చేయడంతో ఈ పథకం రైతులకు అక్కరకు వచ్చేలా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయశాఖ, ఎ¯ŒSఆర్‌జీఈఎస్, విద్యుత్‌ శాఖ సమన్వయలోపం కూడా రైతుల పాలిట శాపంగా పరిణమించింది. ఎన్టీఆర్‌ జలసిరి పథకం కింద సన్నకారు, చిన్నకారు రైతులకు మోటారు బోరును ఉచితంగా ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మధ్యలో నిబంధనలను మార్చేసింది. జిల్లాలో ఎన్టీఆర్‌ జలసిరి పథకం కింద 14,106 మంది రైతులు మోటారు బోరును ఏర్పాటు చేసుకొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు అందులో 13,598 మందిని అర్హులుగా గుర్తించి అనుమతి కోసం భూగర్భ జలవనరులశాఖకు పంపించారు. ఆ శాఖ కేవలం 3,844 పాయింట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. నిబంధనల్లో గందరగోళం వల్ల ఇప్పటివరకూ 592 మంది మాత్రమే బోర్లను తవ్వుకోగా మిగిలిన రైతులు అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ కేవలం 259 మాత్రమే బోర్లను ఏర్పాటు చేసుకోవడం పథకం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. 

  ప్రభుత్వ మెలికపై రైతుల ఆగ్రహం

  ఎన్టీఆర్‌ జలసిరి కింద ఐదెకరాలు కలిగిన రైతులకు రూ.1.16 లక్షలతో 180 అడుగుల లోపు మోటారు బావిని ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సోలార్‌ సిస్టమ్‌తో గాని విద్యుత్‌తో గాని నడిచే మోటారు కనెక్ష¯ŒS ఇస్తామని, ఏది కావాలో రైతులే ఎంచుకోవచ్చని చెప్పారు. ఒకవేళ లోతు ఎక్కువైతే ఆ భారం రైతు భరించవలసి ఉంటుందన్నారు. తవ్వేందుకు రూ.16 వేలు, మోటారుకు రూ.40 వేలు, విద్యుత్‌ లై¯ŒSకు రూ.40 వేలు చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. బోరును తవ్వేందుకు కనీసం రూ.40 వేలు అవుతుండగా ప్రభుత్వం రూ.16 వేలు మంజూరు చేసినా బోరు బావి వస్తుందని ఎక్కడికక్కడ రైతులు మిగతా సొమ్ము భరించేందుకు అంగీకరించారు. విద్యుత్‌ లైన్లకు ఖర్చు ఎక్కు అవుతుందని భావించిన ప్రభుత్వం ఇప్పుడు సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకుంటేనే మోటారు ఉచితంగా ఇస్తామని మెలిక పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము విద్యుత్‌ లై¯ŒS ఏర్పాటు చేసుకుంటే ప్రదేశాలను బట్టి సుమారు రూ. 40 వేల నుంచి రూ.90 వేల వరకూ వ్యయం అవుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో పాటు మోటారు కొనుగోలు భారం కూడా రైతులపై పడితే జలసిరి పథకం ఎందుకుని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కడియం మండలంలోని నర్సరీ రైతులు మినహా మిగిలినచోట్ల సోలార్‌ సిస్టమ్‌పై ఆసక్తి చూపడం లేదు.

  ప్రభుత్వ తీరుపై రైతుల మండిపాటు

  వివిధ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో దశల వారీగా నిర్వహిస్తున్న జలసిరి సమీక్ష సమావేశాల్లో అధికారులు రైతుల ఆగ్రహాన్ని చూడవలసి వస్తోంది. కొన్నిచోట్ల బహిరంగంగానే నిరసనలు తెలియజేస్తుండగా మరికొన్ని మండలాల్లో జలసిరి సమావేశాలను బహిష్కరిస్తున్నారు. బోరు మోటారును ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీతో ఒక్క పైసా ప్రభుత్వం మంజూరు చేయకపోయినా సుమారు రూ.40 వేలతో నిబంధనల మేరకు ఏడు అంగుళాల వెడల్పుతో బోరును తవ్వించుకున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. బోరును తవ్వించుకున్న తరువాత కేవలం సోలార్‌ సిస్టమ్‌ ద్వారానే మోటారును ఏర్పాటు చేస్తామని విద్యుత్‌ లై¯ŒSను ఏర్పాటు చేసుకుంటే పథకం వర్తించదని అధికారులు తేల్చి చెప్పడంతో రైతులకు ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో ఎక్కడికక్కడ రైతులు తవ్వించుకున్న బోరును అలాగే వదిలేస్తున్నారు.

   
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top