
పాలక్కాడ్: ఎటువంటి ప్రమాదం లేదా వ్యాధి విషయంలో తక్షణం స్పందిస్తే, పెద్ద ముప్పును తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. సరిగ్గా దీనినే ఆచరించి చూపారు కేరళకు చెందిన ఒక వైద్యుడు. ఈ ఘటన పాలక్కాడ్ జంక్షన్‌లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ఆ వైద్యుడిని మెచ్చుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే పాలక్కాడ్ జంక్షన్‌లో కన్యాకుమారి-దిబ్రుగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల ప్రయాణికుని దవడ అకస్మాత్తుగా మెలిపడింది. దీంతో అతను బాధతో విలవిలలాడిపోయాడు. తోటి ప్రయాణికులు కూడా అతనిని చూసి, ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రైల్వే వైద్యాధికారి డాక్టర్ జితిన్ పీఎస్ బాధితుడిని పరీక్షించారు. నిముషాల వ్యవధిలోనే అతని దవడను మాన్యువల్‌గా చక్కదిద్దారు. బాధితుడు ఆ వైద్యునికి కృతజ్ఞతలు తెలిపాడు. తరువాత రైలులో ఎక్కి, తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
🏥 Quick medical aid at Palakkad Junction
A 24-year-old passenger traveling on Train No. 22503 Kanniyakumari – Dibrugarh Vivek Express suffered a Jaw dislocation and received timely medical assistance from Dr. Jithin P.S., DMO/RH Palakkad. The passenger resumed the journey… pic.twitter.com/UY4zvSxwJH— Southern Railway (@GMSRailway) October 18, 2025
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా ఆ వైద్యుడిని మెచ్చుకుంటున్నారు. బాధితుడు ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడ్డాడని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని దక్షిణ రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు. ప్రయాణికుల భద్రత, సంక్షేమం విషయంలో తమ వైద్య సిబ్బంది అంకితభావానికి ఇదొక నిదర్శనమని వారు పేర్కొన్నారు.