పోకిరీ పోలీస్ అరెస్ట్... | irresponsible police constable arrested in secunderabad | Sakshi
Sakshi News home page

పోకిరీ పోలీస్ అరెస్ట్...

Jul 25 2015 9:20 AM | Updated on Mar 19 2019 5:52 PM

పోకిరీ పోలీస్ అరెస్ట్... - Sakshi

పోకిరీ పోలీస్ అరెస్ట్...

పీకలదాకా మద్యం తాగిన ఓ కానిస్టేబుల్ తనిఖీల పేరుతో హల్చల్ చేశాడు.

సికింద్రాబాద్ : పీకలదాకా మద్యం తాగిన ఓ కానిస్టేబుల్ తనిఖీల పేరుతో హల్చల్  చేశాడు. నేనే రా పోలీస్‌ అంటూ... సినిమా డైలాగ్‌లు చెప్పి ఓ యువకుడిని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇంతలో అటువైపు వాహనంలో వచ్చిన పోలీసులు... ఈ పోకిరీ కానిస్టేబుల్‌ ఆటకట్టించారు. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నరసింహారావు (37) సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఓ యువతితో బైక్పై వెళుతున్న వ్యక్తిని ఆపి... తాను కమిషనర్ స్పెషల్ టీంలో పనిచేసే కానిస్టేబుల్గా పరిచయం చేసుకుని, తన ఫోన్లో వారి ఫోటో తీసుకుని...'నీవు అమ్మాయిలను సరఫరా చేస్తున్నావని, వ్యభిచారం నిర్వహిస్తున్నావని మాకు సమాచారం అందింది'...అంటూ సదరు యువకుడిని బెదిరిస్తూ డబ్బులు గుంజే ప్రయత్నం చేశాడు.

అదే సమయంలో అక్కడకు చేరుకున్న గోపాలపురం పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పోకిరీ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మూడేళ్ల క్రితం సహ కానిస్టేబుల్ భార్యను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో జైలు పాలైన నరసింహారావు శిక్ష అనభవించి బయటకు వచ్చాడు. విధుల నుంచి తొలగించిన ఇతడు కోర్టు తీర్పుతో ఏడాది క్రితమే డ్యూటీలో చేరాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement