అంతర్‌జిల్లాల స్థాయి సబ్‌జూనియర్స్ హ్యాండ్‌బాల్ పోటీలు హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న ట్లు తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి ఇంటర్ హ్యాండ్‌బాల్ పోటీలు
Aug 6 2016 12:11 AM | Updated on Jul 12 2019 4:28 PM
వరంగల్ స్పోర్ట్స్ : అంతర్‌జిల్లాల స్థాయి సబ్‌జూనియర్స్ హ్యాండ్‌బాల్ పోటీలు హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న ట్లు తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజులపాటు జరి గే టోర్నమెంట్‌లో పది జిల్లాల నుంచి సుమారు మూడు వందల మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్ హాజరవుతారని తెలి పారు. శనివారం సాయంత్రం ప్రారంభించనున్న టోర్నమెంట్‌కు స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కార్పొరేటర్ దామోదర్‌యాదవ్, డీఎస్‌డీఓ ఇందిరతో పాటు వివిధ క్రీడాసంఘాల కార్యదర్శులు హాజరవుతారని పవన్‌కుమార్ పేర్కొన్నారు.
Advertisement


