తల్లిదండ్రులు తరుచూ గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Aug 21 2016 12:28 AM | Updated on Nov 9 2018 5:02 PM
కొత్తూరు(కురవి) : తల్లిదండ్రులు తరుచూ గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన ఎ.ఎల్లయ్య, సరిత దంపతుల కుమార్తె నేరడలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతోంది. శనివారం ఉదయం ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడటాన్ని చూసి మనస్తాపానికి గురై దుక్కి మందును తాగింది. ఆమెను మానుకోటలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Advertisement