ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య | Inter student suicide | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Jan 3 2017 1:22 AM | Updated on Nov 9 2018 5:02 PM

చదువులో వెనుకబడిన ఇంటర్‌ విద్యార్థి మెడిసిన్‌ సీటు వస్తుందో రాదోనన్న భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు.

అనంతపురం సెంట్రల్‌ : చదువులో వెనుకబడిన ఇంటర్‌ విద్యార్థి మెడిసిన్‌ సీటు వస్తుందో రాదోనన్న భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలో నేవీలో పనిచేస్తున్న గోపాల్‌ కుమారుడు చక్రవర్తి (17) అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో ఉంటూ కార్పొరేట్‌ కళాశాలలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో పాసైన ఇతను రెండో సంవత్సరంలో కొంత వెనుకబడినట్లు కళాశాల నుంచి పలుమార్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారమందించారు. రెండో సంవత్సరంలో మార్కులు తక్కువ వస్తే మెడిసిన్‌లో సీటు వస్తుందో రాదో అని తల్లితో చెప్పి బాధపడేవాడు.  ఈ క్రమంలో మనస్తాపానికి గురైన చక్రవర్తి సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్‌ సీఐ రాఘవన్, ఎస్‌ఐ రంగయాదవ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాసుపత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement