నిధుల దుర్వినియోగంపై విచారణ | Sakshi
Sakshi News home page

నిధుల దుర్వినియోగంపై విచారణ

Published Thu, Jan 26 2017 10:33 PM

నిధుల దుర్వినియోగంపై విచారణ

►  పూర్తిస్థాయి పరిశీలన అనంతరం చర్యలు
► డీపీవో సుదర్శన్

జూలపల్లి: వడ్కాపూర్‌ గ్రామ సర్పంచ్‌ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కలెక్టర్‌కు వార్డు సభ్యులు ఈనెల 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్  పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే పనులు చేస్తున్నారని, పంచాయతీలో వసూలైన ఇంటి పన్ను, నల్లా బిల్లు, నూతన నల్లా కనెక్షన్ల డబ్బులు, గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే అంగడిలో వసూలు చేస్తున్న డబ్బులు ఎస్టీవోలో జమ చేయకుండానే సొంతానికి వాడుకుంటున్నారని పేర్కొన్నారు.

కాగా సర్పంచ్‌ కనకట్ల కళ గతంలో వార్డు సభ్యులకు రూ.5వేల చొప్పున ఇచ్చినట్లు, మరిన్ని డబ్బుల కోసమే వేధిస్తున్నారని డీపీవోకు రాసి ఇ చ్చారు. పంచాయతీ రికార్డులను స్వాదీనం చేసుకున్న డీపీవో పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్‌డీ విజయలక్ష్మి, సెక్రటరీ అంజ య్య, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement