మండలంలోని గండ్రాజుపల్లె పారిశ్రామికవాడతో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీఐసీసీ చైర్మన్ క్రిష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన గండ్రాజుపల్లె పారిశ్రామికవాడలో నిర్మాణంలో ఉన్న పలు పరిశ్రమలను పరిశీలించారు.
గండ్రాజుపల్లె పారిశ్రామికవాడతో ఉపాధి
Aug 4 2016 12:44 AM | Updated on Sep 4 2017 7:40 AM
గంగవరం:మండలంలోని గండ్రాజుపల్లె పారిశ్రామికవాడతో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీఐసీసీ చైర్మన్ క్రిష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన గండ్రాజుపల్లె పారిశ్రామికవాడలో నిర్మాణంలో ఉన్న పలు పరిశ్రమలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 20 పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి భూమి తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. అందులో ఐదు పరిశ్రమల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. నాలుగురోడ్ల కూడలిలో నిర్మించిన హెచ్‌టూ అపెరల్స్(గార్మెంట్స్)లో ప్రస్తుతం మూడు వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అనంతరం హెచ్‌టూ అప్పెరల్స్ గార్మెంట్ పరిశ్రమలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్‌ఎం ప్రతాప్‌రెడ్డి, ఏపీఐసీసీ మేనేజర్ మునిరత్నం. హెచ్‌టూ అప్పెరల్స్ ఎండీ హర్షవర్థన్, ఫ్రిమస్ ఫాస్టనర్ పరిశ్రమ ఎండీ జనార్థనరెడ్డి, సిబ్బంది క్రిష్ణప్ప పాల్గొన్నారు.
Advertisement
Advertisement


