అండర్‌–17 కబడ్డీ విభాగం ఇండియన్‌ కెప్టెన్‌గా మంజి | Indian captain of the Under-17 Kabaddi Manzil | Sakshi
Sakshi News home page

అండర్‌–17 కబడ్డీ విభాగం ఇండియన్‌ కెప్టెన్‌గా మంజి

Aug 1 2016 12:18 AM | Updated on Sep 4 2017 7:13 AM

అండర్‌–17 కబడ్డీ విభాగం ఇండియన్‌ కెప్టెన్‌గా మంజి

అండర్‌–17 కబడ్డీ విభాగం ఇండియన్‌ కెప్టెన్‌గా మంజి

కేసముద్రం మండలం బేరువాడ శివారుlగుడి తండాకు చెందిన బోడ మంజి అండర్‌–17 విభాగంలో ఇండియన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. త్వరలోనే నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ కబడ్డీ క్రీడలో మంజి ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.

మహబూబాబాద్‌ : కేసముద్రం మండలం బేరువాడ శివారుగుడి తండాకు చెందిన బోడ మంజి అండర్‌–17 విభాగంలో ఇండియన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. త్వరలోనే నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ కబడ్డీ క్రీడలో మంజి ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం(తెగ) ఆధ్వర్యంలో మానుకోటలో ఆ విద్యార్థిని ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం డివిజన్‌ అధ్యక్షుడు బాలునాయక్, కార్యదర్శి హట్యానాయక్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ వెంకట్రాములు, జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వీరన్న, సభ్యులు వీరన్ననాయక్‌ మాట్లాడుతూ మంజి నేపాల్‌ వెళ్లేందుకు అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement