మరికొన్ని భాషల్లోకి ‘క్యాంపస్‌ అంపశయ్య’ | In some languages, "Campus ampasayya ' | Sakshi
Sakshi News home page

మరికొన్ని భాషల్లోకి ‘క్యాంపస్‌ అంపశయ్య’

Aug 3 2016 11:51 PM | Updated on Sep 4 2017 7:40 AM

మరికొన్ని భాషల్లోకి ‘క్యాంపస్‌ అంపశయ్య’

మరికొన్ని భాషల్లోకి ‘క్యాంపస్‌ అంపశయ్య’

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ రాసిన నవలా ఆధారంగా నిర్మించిన ‘క్యాంపస్‌ అంపశయ్య’ చిత్రాన్ని త్వరలో తమిళం, మళయాళం, హిందీ, ఆంగ్లభాషల్లోకి అనువదించి విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు ప్రభాకర్‌ జైనీ తెలిపారు.

హన్మకొండ చౌరస్తా : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ రాసిన నవలా ఆధారంగా నిర్మించిన ‘క్యాంపస్‌ అంపశయ్య’ చిత్రాన్ని త్వరలో తమిళం, మళయాళం, హిందీ, ఆంగ్లభాషల్లోకి అనువదించి విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు ప్రభాకర్‌ జైనీ తెలిపారు.
 
ఈ మేరకు అంపశయ్య నవీన్‌తో కలిసి సినీ యూనిట్‌ బృందం సభ్యులు బుధవారం హన్మకొండలోని శ్రీదేవి ఏషియన్‌మా ల్‌లో సినిమాను తిలకించారు. అంతకు ముందు డైరెక్టర్‌ ప్రభాకర్‌ జైనీ విలేకరులతో మాట్లాడారు. గత నెల 30న విడుదలైన క్యాంపస్‌ అంపశయ్య చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. తెలంగాణలోని నర్సాపూర్‌ అడవులు, రుస్తుంపేట గ్రామం, రామ ప్ప, ఉస్మానియా క్యాంపస్‌ తదితర ప్రాంతాల్లో అనేక వ్యయ ప్రయాసాలకోర్చి చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. ప్రజలు సినిమాను ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. అంపశయ్య నవీన్‌ మాట్లాడుతూ అమెరికాలో సైతం ఈ చిత్రం విడు దలైందన్నారు. క్యాంపస్‌ అంపశయ్య సినిమాలో హీరో, హీరోయిన్ల నటన ఆకట్టుకుంటుందన్నారు. వారి వెంట హీరో శ్యామ్‌కుమార్, హీరోయిన్‌ పావని, విజయలక్ష్మి జైనీ, ఉప్పుల సంతోష్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement