ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వీసీ సాంబశివరావును తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
హైదరాబాద్: సంచలనం సృష్టించిన రితేశ్వరి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వీసీ సాంబశివరావును తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. సాంకేతిక విద్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మిని ఆయన స్థానంలో నియమించనుంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశముంది.
ర్యాగింగ్, విద్యార్థి కుల సంఘాల పోరు నివారించడంలో విఫలమయ్యారని సాంబశివరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సాంబశివరావు స్థానంలో ప్రొఫెసర్ సింహాద్రిని వీసీగా నియమిస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. కాగా, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు శనివారం అందజేసింది.