ఆస్పత్రుల చుట్టూ తిరగలేక ఆత్మహత్యాయత్నం | husband died after couples suicide attempt in vizianagaram district | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల చుట్టూ తిరగలేక ఆత్మహత్యాయత్నం

Jul 18 2016 12:42 PM | Updated on Sep 4 2017 5:16 AM

అనారోగ్యంతో బాధపడుతున్న ఆలుమగలు..ఆస్పత్రుల చుట్టూ తిరగలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

- భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
 
విజయనగరం: అనారోగ్యంతో బాధపడుతున్న ఆలుమగలు..ఆస్పత్రుల చుట్టూ తిరగలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ సంఘటనలో భర్త మృతి చెందగా..భార్య పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. విజయనగరంలోని కల్పన థియేటర్ సమీపంలో ఉంటున్న ఎం.గణేష్ ఓ ఆస్పత్రిలో సూపర్‌ వైజర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నగణేష్ దంపతులు మనస్థాపంతో ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా గణేష్(47) మృతి చెందాడు. భార్య శివకుమారి(42) ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement