నన్నయలో హెచ్‌ఆర్‌డీ సెంటర్‌ | hrd centre at nannaya | Sakshi
Sakshi News home page

నన్నయలో హెచ్‌ఆర్‌డీ సెంటర్‌

Aug 17 2016 11:20 PM | Updated on Sep 4 2017 9:41 AM

రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : భవిషత్తులో ఉద్యోగ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో హెచ్‌ఆర్‌డీ సెంటర్‌ కీలకపాత్ర వహిస్తుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. వర్సిటీలో వికాస్‌

రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : భవిషత్తులో ఉద్యోగ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో హెచ్‌ఆర్‌డీ సెంటర్‌ కీలకపాత్ర వహిస్తుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. వర్సిటీలో వికాస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ని బుధవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సెంటర్‌ ద్వారానే ఉద్యోగావకాశాలు కల్పించే కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తామని వికాస్‌ పీడీ వీఎన్‌ రావు అన్నారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కేఎన్‌ రమేష్, అకడమిక్‌ అఫైర్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.టేకి, ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ పి.సురేష్‌వర్మ, డాక్టర్‌ మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement