భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్ చెరువుకు మంగళవారం తెల్లవారుజామున గండి పడింది.
కరీంనగర్ : భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్ చెరువుకు మంగళవారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో పోతుగల్ గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద ప్రవాహానికి స్థానికంగా ఉన్న గంగమ్మ ఆలయం కొట్టుకుపోయింది. అంతేకాకుండా వందలాది ఎకరాల్లోని పంట నీటమునిగింది. ముస్తాబాద్ - సిద్ధిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.