భక్తజనకీలాద్రి | Heavy crowd at Indrakeeladri | Sakshi
Sakshi News home page

భక్తజనకీలాద్రి

Oct 8 2016 8:36 PM | Updated on Sep 4 2017 4:40 PM

భక్తజనకీలాద్రి

భక్తజనకీలాద్రి

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిౖయెన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసేలా ప్రత్యేకంగా అలంకరిస్తారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిౖయెన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసేలా ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను శనివారం శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు.  శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి... వీణ, దండ, కమండలం, అక్షరమాల, నెమలితో కూడిన అభయముద్రను ధరించిన చదువుల తల్లిని దర్శించి భక్తులు తరించారు. ‘ తల్లీ.. మా అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞానం ప్రసాధించు..’ అని వేడుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి.. భక్తజనకీలాద్రిగా మారింది.  – సాక్షి, విజయవాడ 
 

Advertisement
 
Advertisement
Advertisement