ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలి | haritha haram | Sakshi
Sakshi News home page

ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలి

Aug 5 2016 11:57 PM | Updated on Sep 4 2017 7:59 AM

హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలని మండల ప్రత్యేకాధికారి వెంకట్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ ప్రణాళిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు.

దహెగాం : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలని మండల ప్రత్యేకాధికారి వెంకట్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ ప్రణాళిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు.
         నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలం అయినందున గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ బికర్నదాస్, ఎంపీడీవో కుటుంబరావు, ఎంఈవో నారాయణ, పీఆర్‌ ఏఈ భిక్షపతి, ఈజీఎస్‌ ఏపీవో చంద్రయ్య, ఏపీఎం అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement