ఖమ్మం జిల్లా కారేపల్లి సమీపంలో గుట్కా ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు.
గుట్కా ప్యాకెట్ల లారీ పట్టివేత
Jul 23 2016 4:06 PM | Updated on Sep 26 2018 6:49 PM
కామేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి సమీపంలో గుట్కా ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. విజిలెన్స్ సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఖమ్మం నుంచి ఇల్లందు వైపు వెళ్తున్న లారీలో సోదాలు జరిపగా గుట్కా ప్యాకెట్ల గుట్టురట్టయింది. మొత్తం సరుకు విలువ, రవాణాదారుల వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement


