సజావుగా ‘గురుకుల’ కౌన్సెలింగ్‌ | gurukula admission councelling | Sakshi
Sakshi News home page

సజావుగా ‘గురుకుల’ కౌన్సెలింగ్‌

Sep 18 2016 12:13 AM | Updated on Aug 17 2018 3:08 PM

స్థానిక టేకులోడు గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్‌ కేటగిరీకి సంబంధించిన 6,7,8 తరగతుల విద్యార్థులకు శనివారం కౌన్సెలింగ్‌ జరిగింది.

చిలమత్తూరు : స్థానిక టేకులోడు గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్‌ కేటగిరీకి సంబంధించిన 6,7,8 తరగతుల విద్యార్థులకు శనివారం కౌన్సెలింగ్‌ జరిగింది. పేరూరు, పెన్నహోబిళం, నసనకోట, టేకులోడు, లేపాక్షి ప్రాంతాల పరిధిలోని 52 సీట్ల కోసం 162 మంది విద్యార్థులు గత బుధవారం ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.

అందులో ఉత్తీర్ణత సాధించిన 36 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు ప్రిన్సిపల్‌ ప్రసాద్‌ తెలిపారు. ఎస్సీ జాబితాలో 10 మంది బాలికలు, ఆరుగురు బాలురు పెండింగ్‌లో ఉన్నారని వారికి కూడా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement