పెళ్లి కొడుకు ఉంగరం మాయం కొద్దిసేపు ఆగిన పెళ్లి | groom ring Theft wedding stops for a time | Sakshi
Sakshi News home page

పెళ్లి కొడుకు ఉంగరం మాయం కొద్దిసేపు ఆగిన పెళ్లి

Apr 21 2016 2:39 AM | Updated on Sep 3 2017 10:21 PM

పెళ్లి కొడుకు ఉంగరం మాయం కొద్దిసేపు ఆగిన పెళ్లి

పెళ్లి కొడుకు ఉంగరం మాయం కొద్దిసేపు ఆగిన పెళ్లి

వివాహ వేడుకల్లో పెళ్లి కొడుకు ఉంగరం మాయమైంది. దీంతో రెండు గంటల పాటు పెళ్లి తంతు ఆగింది. నారాయణఖేడ్ మండలం

నారాయణఖేడ్: వివాహ వేడుకల్లో పెళ్లి కొడుకు ఉంగరం మాయమైంది. దీంతో రెండు గంటల పాటు పెళ్లి తంతు ఆగింది. నారాయణఖేడ్ మండలం సత్తెగామ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లింగొండ, సంగమ్మల కూతురు భారతికి చిన్న హైదరాబాద్‌కు చెందిన అనిల్‌తో వివాహం బుధవారం సత్తెగామ గ్రామంలో నిర్వహించారు.

పురోహితుడు ఈశ్వరయ్యస్వామి వరుడికి బంగారు ఉంగరం, వధువు తాళి, మట్టెలు పల్లెంలో ఉంచి మంత్రాలు ఉచ్ఛరిస్తున్నారు. ఈ క్రమంలో మాంగల్యధారణ  సమయంలో ఉంగరం కనిపించకపోవడంతో వివాహ మండపంలో చోరీ కలకలం రేగింది. రెండు గంటల పాటు పెళ్లితంతు నిల్చిపోయింది. చివరకు పెద్దలు జోక్యం చేసుకొని శుభకార్యాన్ని కానిచ్చారు. ఉంగరం ఎవరు మాయం చేశారనేది మిస్టరీగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement