
జననేతకు నీరాజనం
విమానాశ్రయ ఆవరణ కిక్కిరిసిపోయింది. పతాకాలతో కళకళలాడింది.
విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం
రాత్రి విశాఖలోనే బస.. నేడు హైదరాబాద్‌కు
గోపాలపట్నం : విమానాశ్రయ ఆవరణ కిక్కిరిసిపోయింది. పతాకాలతో కళకళలాడింది. జగన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తింంది.. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ రాక సందర్భంగా సోమవారం ఉదయం ఎయిర్‌పోర్టులో కనిపించిన దృశ్యమిది.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆ పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా విజయనగరంలో యువభేరి కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విమానంలో చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనాలు పట్టారు. అపూర్వ స్వాగతం పలికారు. వారి ఆదరణను చూసి ఉప్పొంగిన ఆయన విమానాశ్రయం వెలుపలికి వచ్చి అందరికీ అభివాదం చేశారు. నాయకులను పలకరించారు. అనంతరం రోడ్డుమార్గంలో విజయనగరం వెళ్లారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకుల రాకతో విమానాశ్రయ ఆవరణలో కోలాహలం నెలకొంది. అభిమానులు జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. కొందరు ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నా«థ్, ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, తైనాల విజయకుమార్, నియోజకవర్గ సమన్వకర్తలు వంశీకృష్ణ యాదవ్, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ పశ్చిమ నియోజకవర్గ పరిశీలకుడు సత్తి రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనూకు, జాన్ వెస్లీ, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, పార్టీ నాయకులు ఉరుకూటి అప్పారావు, జియ్యాని శ్రీధర్, గరికిన గౌరి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్, శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, రొంగలి జగన్నాథం, పల్లా చినతల్లి పెంటారావు, కలిదిండి బదిరీనాథ్, రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్ యాదవ్, నగర కార్యదర్శి చెవ్వేటి జీవన్‌కుమార్, 69వ వార్డు అధ్యక్షుడు దాసరి అప్పలరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి యతిరాజుల నాగేశ్వర్రావు తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
కాగా విజయనగరం పర్యటన ముగించుకున్న అనంతరం సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తిరిగి విశాఖ చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి సరŠుక్యట్ హౌస్‌లో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం 9.20 గంటలకు విమానంలో ఆయన హైదరాబాద్‌కు తిరిగి వెళతారని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశీల రఘురామ్ తెలిపారు.